ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 7:52 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వాహనాల తనిఖీల్లో 200 గ్రాముల గంజాయి పట్టివేత ఒక వ్యక్తి అరెస్టు

వాహనాల తనిఖీల్లో 200 గ్రాముల గంజాయి పట్టివేత ఒక వ్యక్తి అరెస్టు

బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్*

*సి ఆర్. నెంబర్: 147/2026 యు/ ఎస్ ఇ సి: 8(c) ఆర్/డబ్ల్యూ20(బి)(ii)(ఏ) & 27(బి) ఎన్ డి పి ఎస్. ఏ సి టిఅర్జున్ సమాచారం సెప్టెంబర్ 7 బెల్లంపల్లి నియోజకవర్గం ప్రతినిధి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
నిన్న అనగా తేది.06.09.2026 నాడు సాయంత్రం పై అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై డి. రామకృష్ణ , సిబ్బంది హెచ్ సి. ఆర్. శ్రీనివాస్ (2363), పి సి డి. జాన్సన్ (1058), హెచ్ జి ఎండి హాజీ (132) మరియు ఏ ఆర్ హెచ్ సి G. సత్యనారాయణ గారితో కలిసి ప్రభుత్వ వాహనం ఇన్నోవా నెంబర్: టీఎస్09 పిఏ 3562 లో ఎన్ హెచ్-363, పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 17:30 గంటలకు అనుమానాస్పదంగా వస్తున్న నలుపు & ఎరుపు రంగు కలిసిన హోండా 125 మోటార్ సైకిల్ ను ఆపి తనిఖీ చేయగా, ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డాడు.

అర్జున్ సమాచారం సెప్టెంబర్ 7 బెల్లంపల్లి నియోజకవర్గం ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
నిన్న అనగా తేది.06.09.2026 నాడు సాయంత్రం పై అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై డి. రామకృష్ణ , సిబ్బంది హెచ్ సి. ఆర్. శ్రీనివాస్ (2363), పి సి డి. జాన్సన్ (1058), హెచ్ జి ఎండి హాజీ (132) మరియు ఏ ఆర్ హెచ్ సి G. సత్యనారాయణ గారితో కలిసి ప్రభుత్వ వాహనం ఇన్నోవా నెంబర్: టీఎస్09 పిఏ 3562 లో ఎన్ హెచ్-363, పంచముఖి హనుమాన్ విగ్రహం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 17:30 గంటలకు అనుమానాస్పదంగా వస్తున్న నలుపు & ఎరుపు రంగు కలిసిన హోండా 125 మోటార్ సైకిల్ ను ఆపి తనిఖీ చేయగా, ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డాడు.

నిందితుని వివరాలు:
గోమాసు ప్రకాష్, తండ్రి: నారాయణ, వయస్సు: 24 సం.లు, కులం: SC-మాల, వృత్తి: ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, నివాసం: ఇం.నెం: 5-33, సాలుగుపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా.

నేరం వివరాలు:
నిందితుడు మంచిర్యాలలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ, గత 3 నెలలుగా గంజాయికి అలవాటు పడి, తన చెడు అలవాట్లకు డబ్బు కోసం తక్కువ ధరకు మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి, యువతకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు విచారణలో తెలిపాడు. తేదీ :05.09.2026 న మంచిర్యాల నుండి తన హోండా ఎస్పి
125 బైక్ నెంబర్: టీజీ19 4074 పై బయలుదేరి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద బైక్ పార్క్ చేసి, రైలులో బల్లార్షా వెళ్లి ఈ రోజు ఉదయం 09:00 గంటలకు 200 గ్రాముల గంజాయిని రూ.5000/- లకు కొనుగోలు చేసి, తిరిగి బెల్లంపల్లి వచ్చి, బజార్ ఏరియా నుండి తన గ్రామానికి వెళ్తూ బెజ్జూర్ పరిధిలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు.

స్వాధీనం చేసుకున్న సొత్తు:

  1. 200 గ్రాముల ఎండు గంజాయి – విలువ సుమారు రూ.10,000/-
  2. నలుపు & ఎరుపు రంగు హోండా ఎస్పీ125 బైక్. నెంబర్: టీఎస్19 4074
  3. పి ఓ సి ఓ ఎక్స్3 – డార్క్ గ్రే మొబైల్ ఫోన్ (: ఐ ఎం ఈ ఐ).868305057637351

పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, పై సొత్తును సీజ్ చేసి, నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది.

కె. శ్రీనివాస రావు,*
ఎస్ హెచ్ ఓ, బెల్లంపల్లి 1 టౌన్ పిఎస్